శివ స్తుతి చేస్తూ ఇతర దేవతలను నిందించే వ్యక్తి కథ చివరకు ఏమైందో తెలుసా?

కాకభూషుండి గురించి ఎప్పుడైనా విన్నారా? అత్యంత జ్ఞానవంతుడైన రామ భక్తుడే కాకభూషుండి. ఓ మహర్షి శాపంతో కాకిలా మారాడు. అసలు కాకభూషుండి ఎవరు? ఏంటా శాపం? చూద్దాం. పరమేశ్వరుడు శ్రీరాముని కథను పార్వతీదేవిగా వివరిస్తుండగా.. కాకి విన్నదట. అదే కాకి మరో జన్మలో కాకభూషుండిగా జన్మించాడట. రామ, రావణ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రామలక్ష్మణులను రావణుడి కుమారుడు మేఘనాదుడు పాముతో కట్టేస్తాడు. అప్పుడు నారదముని గరుత్మంతుడిని పంపి పాము నుంచి వారిని విడిపిస్తాడు. శ్రీరాముడు పాముతో బంధించబడడం చూసిన గరుత్మంతుడికి రామావతారంపై అనుమానం వస్తుంది. గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి నారదుడు బ్రహ్మ దేవుడి వద్దకు పంపగా.. ఆయన మహాదేవుని వద్దకు పంపాడు. అప్పుడు మహాదేవుడు.. గరుత్మంతుడుని కాకభూషుండి వద్దకు పంపాడు.

అప్పుడు కాకభూషుండి.. గరుత్మంతుడి సందేహాలను తీర్చడంతో పాటు తాను కాకిగా మారిన వైనాన్ని వివరించాడు. మొదట అయోధ్య పురిలో ఒక శూద్రుని ఇంట్లో కాకభూషుండి జన్మించాడు. అతను శివ భక్తుడు కావడంతో శివస్తుతిని చేస్తూనే పరదేవతలను నిదించసాగాడు. ఒకసారి అయోధ్యలో కరువు సంభవించడంతో ఉజ్జయినికి వెళ్లి అక్కడో బ్రహ్మణుడికి సేవ చేస్తూ కాలం గడపడం ఆరంభించాడు. ఆ బ్రాహ్మణుడు కూడా శివభక్తుడే కానీ పర దేవతలను నిందించేవారు కాదు. పైగా కాకభూషుండి గురించి తెలుసుకుని శ్రీ రామునిపై భక్తిని ప్రబోధించడం ప్రారంభించాడు. అయితే చివరకు కాకభూషుండి అహకారంతో గురువును సైతం అవమానించగా శివుడికి కోపం అతడిని శపించాడు. ఆ శాప విమోచన కోసం శ్రీరామునిపై భక్తిని ప్రదర్శిస్తూ బ్రాహ్మణ శరీరాన్ని పొందాడు. ఆపై జ్ఞాన సముపార్జన కోసం లోమాష్ ఋషి వద్దకు వెళ్లాడు. ఆయన సలహాలను సైతం నిందించేవాడు. దీంతో ఆగ్రహించి ఋషి కాకభూషుండిని చండాల పక్షిగా అంటే కాకిగా మారమని శపించాడు.

Share this post with your friends