పంచామృతం, పంచగవ్యములు అని వేటిని పిలుస్తారో తెలుసా?

దేవుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. మన ఇంట్లో ఏదైనా వ్రతం ఉన్నా కూడా తీర్థంగా పంచామృతం తీసుకుంటాం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి , తేనె, పంచదారను పంచామృతం అంటాము. పంచామృతాన్ని హోమంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం, హవన్, పూజ వంటి సమయాల్లో ఉపయోగిస్తుంటారు. ఈ పంచామృతాన్ని స్వీకరిస్తే.. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమతుల్యం అవుతుందని నమ్మకం. పంచామృతంలో వాడే ఒక్కో పదార్థం ఒక్కో దానికి సంకేతం. పాలు స్వచ్ఛత, పోషణకు చిహ్నంగానూ… పెరుగు ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

నెయ్యి జ్ఞానం, కాంతికి చిహ్నంగానూ.. తేనె మాధుర్యం, జీవితానికి సంకేతంగానూ.. గంగాజలం లేదంటే కొబ్బరి నీళ్లు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. పంచామృతాన్ని తీర్థంగానే కాకుండా దేవతలను అభిషేకించడానికి కూడా ఉపయోగిస్తారు. పంచామృతంతో దేవతలను అభిషేకిస్తే త్వరగా ప్రసన్నులవుతారట. తద్వారా మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. పైగా పంచామృతం తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఏకాగ్రత పెరుగుతుందట. ఇక పంచగవ్యములు వేరు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రములను పంచగవ్యములని అంటారు.

Share this post with your friends