అరటి ఆకుని తేలిగ్గా తీసుకోకండి.. దీనిలో కొందరు దేవతలకు నైవేద్యం సమర్పిస్తే..

హిందువులంతా శుభకార్యాల్లోనూ.. పూజా సమయాల్లోనూ అరటి చెట్టును, అరటి ఆకును, అరటి పండ్లను ఉపయోగిస్తారు. అరటి ఆకులలో ముఖ్యంగా విష్ణు మూర్తితో పాటు లక్ష్మీదేవి ఉంటారని నమ్మకం. అందుకే అరటి చెట్టును దైవంగా భావిస్తూ అరటి ఆకుతో పాటు అరటి పండ్లను ఉపయోగిస్తారు. అరటి ఆకుల నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. ఇక వివాహాది శుభకార్యాల్లో అరటి ఆకులో భోజనం చేస్తారు. అలాగే కొందరు దేవతలకు సైతం అరటి ఆకులోనే నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. మరి ఏ ఏ దేవుళ్లకు అలా అరటి ఆకులో నైవేద్యం పెడతారో చూద్దాం.

శ్రీ మహావిష్ణువుకు అరటి ఆకులోనే నైవేద్యం సమర్పిస్తారు. ఇది ఆలయంలోనే కాదు.. ఇంట్లో పూజ గదిలోనూ స్వామివారికి ఇలాగే నైవేద్యం సమర్పిస్తారు. అలాగే లక్ష్మీదేవికి సైతం సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో పాటు ఆర్థికంగానూ చాలా బాగుంటుందని నమ్ముతారు. వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నా కూడా అరటి ఆకులో విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తే ఆటంకాలు తొలుగుతాయట. అలాగే గణేషుడికి సైతం అరటి ఆకులో నైవేద్యం సమర్పించాలట. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయట. దుర్గాదేవికి సైతం అరటి ఆకులో నైవేద్యాన్ని సమర్పించాలట. ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందట.

Share this post with your friends