విశాఖలో జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం..

జగన్నాథుని రథయాత్ర అనగానే మనకు ఒరిస్సా రాష్ట్రంలోని పూరి గుర్తొస్తుంది. దీనిని వైజాగ్‌లో కూడా స్వామివారి రథ యాత్ర శోభాయమానంగా జరుగుతుంటుంది. నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెల 7వ తేదీన జగన్నాథ స్వామి రథయాత్రకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వుడా పార్క్ ఎదురుగా సాయంత్రం 4.30 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. ముఖ్య అతిథులుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. రథయాత్ర వివరాలను ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు వివరించారు. జగన్నాథుని రథ చక్రాలు కదిలితే ప్రకృతి సైతం పులకిస్తుందని విశాఖ వాసులు చెబుతుంటారు. ఎందుకంటే ఆ రోజున తప్పక వర్షం కురుస్తుందట.

జగన్నాథుని రథాన్ని వరుణుడు పావనం చేస్తాడని అంటారు. విశాఖ నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన జగన్నాథుడి ఆలయం ఉంది. కాబట్టి విశాఖలో ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. పూరిలో ఎంత గొప్పగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అంతే గొప్పగా జరుగుతుంది. ఈ రథయాత్రను ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్నాథుని రథయాత్ర అనంతరం టర్నర్ చౌల్ట్రీ వద్ద కళ్యాణ మండపంలో తొమ్మిది రోజుల పాటు వివిధ అవతారాల్లో స్వామివారు దర్శనమిస్తారు. రథ యాత్ర జరిగే ప్రాంతమంతా సుందరంగా ముస్తాబవుతోంది.

Share this post with your friends