70 ఏళ్ల ఖైరతాబాద్ గణేశ్ చరిత్రలో తొలిసారిగా అవాంతరాలు..

వినాయక చవితి వస్తోందంటే చాలు.. ముందుగా మాట్లాడుకునేది ఖైరతాబాద్ గణేషుడి గురించే. ఆయనను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తుంటారు. ఖైరతాబాద్ గణేషుడి విగ్రహ తయారీ మొదలు ప్రతి ఒక్క అంశమూ ఆసక్తికరమే. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం చోటు చేసుకుంది. 70 ఏళ్ల ఖైరతాబాద్ గణేశ్ చరిత్రలో ఎందుకోగానీ తొలిసారిగా అవాంతరాలు ఎదురయ్యాయి. అవి ఎలాంటి అవాంతరాలు అంటారా? విగ్రహ తయారీ పనుల్లో అవాంతరాలు.. ఒక అడుగు ముందుకు పడితే.. నాలుగు అడుగులు వెనక్కు పడుతున్నాయి.

ప్రతి ఏటా వంద రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ ప్రక్రియను నిర్వహకులు ప్రారంభిస్తారు. మరి విగ్రహ తయారీ పనుల్లో అవాంతరాలు ముఖ్యంగా ఉత్సవ కమిటీ కారణంగా ఏర్పడ్డాయి. ఖైరతాబాద్ గణేష్‌కి సంబంధించిన పాత, కొత్త కమిటీల మధ్య సమన్వయం కొరవడంతో ఇబ్బంది తలెత్తింది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే 36 రోజుల పాటు విగ్రహ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తమకు సమాచారం ఇవ్వకుండానే కొత్త కమిటీ అన్ని పనులు చేస్తోందని ఉత్సవ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది రాజ్ కుమార్ గణేష్ ఉత్సవ బాధ్యతలను నిర్వహించారు. ఈ సారి మాత్రం సింగారి కుటుంబంతో సంబంధం లేకుండా తామే గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తామని స్థానికులు చెబుతున్నారు.

Share this post with your friends