మావుళ్ళమ్మ హుండీ ఆదాయం ఎంత వచ్చిందో తెలిస్తే..

విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత భీమవరం మావుళ్ళమ్మ. తొమ్మిది దశాబ్దాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతోంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు. ఇవాళ మావూళ్లమ్మ తల్లి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ హుండీ ద్వారా మొత్తం 92 రోజులకు గానూ.. అరవై తొమ్మిది లక్షల ఇరవై వేల రెండు వందల ఎనబై ఆరు రూపాయలు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు.

అలాగే వెండి, బంగారంతో పాటు విదేశీ కరెన్సీ వివరాలను సైతం వెల్లడించారు. బంగారం 154 గ్రాములు, వెండి 590 గ్రాములు, విదేశీ కరెన్సి గణనీయంగా లభించింది బహరైన్ దేశానికీ చెందిన 1 దీనార్ , అమెరికాకి చెందిన 144 డాలర్లు, ఖత్తార్ దేశానికి చెందిన 50 రియాల్స్ , ఎమిరేట్స్ దేశానికీ చెందిన 5 దిర్హామ్స్ , ఆస్ట్రేలియా కి చెందిన 5 డాలర్లు, బ్రిటన్ దేశానికి చెందిన 10 పౌండ్లు, యూరప్ దేశానికి చెందిన 10 యూరోలు, కెనడా కి చెందిన 5 డాలర్లు, ఐర్లాండ్ కి చెందిన 10 పౌండ్లు,మలేసియా కి చెందిన 1 రింగిట్టు, ఒమాన్ కి చెందిన 100 బైసాలు, సమర్పించుకున్నారు.ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, పరివేక్షణదారు తనిఖీదారివారు వి వేంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Share this post with your friends