ఈ శివయ్యను పూజిస్తే చాలు.. ఎన్ని ఆటంకాలైనా దాటేయవచ్చట..

భారతదేశంలో దేవాలయాలకేమీ కొదువ లేదు. మరీ ముఖ్యంగా శివాలయాలైతే ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. దీనిని శ్రీ రూపేశ్వర మహాదేవుడి ఆలయమని అంటారు. ఈ ఆలయంలో రెండు శివలింగాలున్నాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించేది ఒకటైతే.. నెగిటివిటీని నాశనం చేసేది మరొకటని నమ్మకం. మనం చేస్తున్న పనిలో ఆటంకాలెదురైనా లేదంటే నష్టాలు వస్తున్నా కూడా రూపేశ్వర్ మహాదేవుని పూజిస్తే అంతా సెట్ అవుతుందట. ఈ రూపేశ్వర ఆలయంలోని శివలింగాలు ఆసక్తికరంగా ఉంటాయి.

ఒకటి తెలుపు రంగులోనూ.. మరొకటి నలుపు రంగులోనూ ఉంటాయి. తెలుపు రంగులో ఉన్న శివలింగం వచ్చేసి చెరువు మధ్యలో ఉంటుంది. ఇది సానుకూల శక్తిని అందిస్తుందని భక్తుల నమ్మకం. దీని పక్కనే నల్ల రాయితో చేసిన శివలింగం ఉంటుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుందట. ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు జలాభిషేకం కూడా చేస్తారు. ఇక ఇతర పూజా కార్యక్రమాలన్నీ యథావిధిగానే నిర్వహిసన్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో అంటే గర్భుగడిలోకి ప్రవేశించడానికి ముందు పురాతన శివపార్వతుల విగ్రహం ఉంటుంది. నేలపై విష్ణుమూర్తితో పాటు దేవతా విగ్రహం కూడా ఉంటుంది. ఇక ఆలయమంతా దేవతా విగ్రరహాలతో నిండిపోయి ఉంటుంది.

Share this post with your friends