పూరి జగన్నాథ ఆలయంలో ఆసక్తికర తంతు.. నగరమంతా విద్యుత్ తీసేసి చాలా గోప్యంగా..

పూరిలోని శ్రీ జగన్నాథుని ఆలయం ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం ఇవ్వబడింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితో పాటు ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రా దేవి కొలువై ఉంటారు. రథోత్సవంలో కూడా శ్రీకృష్ణుడితో పాటు ఆయన అన్న, సోదరి కోసం రథాలను ఏర్పాటు చేస్తారు. హిందువుల నాలుగు ధాములలో ఒకటిగా పేర్కొనే ఈ ఆలయంలో వింతలూ విశేషాలకు కొదువేమీ లేదు. ఇక్కడి ప్రధాన ఆలయాల్లోని విగ్రహాలను పుష్కర కాలానికి అంటే 12 ఏళ్లకోసారి మారుస్తూ ఉంటారు.

ఈ సంప్రదాయం ఈనాటిది శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలసు ఇలా విగ్రహాలను మార్చడం ఎందుకనే విషయాన్ని పక్కనబెడితే ఈ తంతు జరిగే తీరు మాత్రం అత్యంత ఆశ్చర్యకరంగానూ.. ఆసక్తికరంగానూ ఉంటుంది. ఎందుకంటే ఈ తంతు చాలా గోప్యంగా జరుగుతుంది. విగ్రహాలను మార్చే సమయంలో నగరమంతా గాఢాంధకారంలో మునిగిపోతుంది. నగరంలో విద్యుత్ సరఫరాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఇక విగ్రహాలను మార్చే సమయంలో ప్రధాన పూజారి మినహా ఎవరూ ఉండరు. ఇక్కడ కూడా మరో ఆసక్తికర విషయం ఉంది. ప్రధాన పూజారి కళ్లకు గంతలు కడతారు. ఆ తరువాతే విగ్రహ మార్పిడి కార్యక్రమం ఉంటుంది.

Share this post with your friends