చిత్రవిచిత్రమైన అరుపులు, కేకలతో ఈ ఆలయం భయం కలిగిస్తుంది..

రాజస్థాన్లోని అరావళీ పర్వాతల నడుమ దౌసా అనే జిల్లాలోని ‘మెహందీపూర్ బాలాజీ’ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయంలో మరో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయంలోకి చేరుకోగానే మనకు బాలరూపంలో ఉన్న హనుమంతుడు కనిపిస్తాడు. అప్పట్లో మన దేశం మీదకు ముష్కరులు దండెత్తారు. అయితే వారు ఈ ఆలయంలోని విగ్రహాన్ని పెకిలిచేందుకు ప్రయత్నించారట. కానీ ఎంత తవ్వినా కూడా వారికి విగ్రహం లోతు తెలియలేదట. దీంతో ఇక ఏం చెయ్యలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వెళ్లిపోయారట.ఈ స్వామి పాదాల చెంత నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని భక్తులకు తీర్థంగా అందిస్తారు. అవి తాగిన వారికి మానసిక సమస్యలన్నీ దూరమవుతాయట.

అసలు ఈ నీరు తాగగానే వారిలో తప్పక మార్పు కనిపిస్తుందట. ఈ ఆలయానికి ప్రతి రోజూ భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది కానీ మంగళ, శనివారాల్లో అయితే మరింత పోటెత్తుతారు. ఏదో మామూలుగా స్వామివారిని దర్శించుకుందామని వెళితే మాత్రం మనకు ఆ ప్రదేశం చాలా భయంకరంగా కనిపిస్తుంది. దయ్యం పట్టిందని భావించే వారు.. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ, అరుస్తూ, గంతులు వేస్తూ ఉంటారు. దాదాపు ఆలయమంతా వీరే కనిపిస్తారు. ఒక్కోసారి వారిని పట్టుకోవడం కష్టమైతే.. గొలుసులతో కట్టేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఆలయానికి వచ్చారు కాబట్టి వారు దాదాపు తమ సమస్యలను అధిగమిస్తారట.

Share this post with your friends