స్త్రీలు మాత్రమే గాజులు వేసుకోవడం వెనుక ఆంతర్యమేంటంటే..

ఒకప్పుడు గాజులను పురుషులు కూడా వేసుకునేవారట. కాలక్రమంలో పురుషులు ధరించడం మానేశారట. స్త్రీలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. స్త్రీలు వేసుకునే గాజులు అందానికే కాదు.. దాని వెనుక పరమార్థం వేరేలా ఉంది. గాజులు.. స్త్రీకి రక్షాకంకణం వంటిది. పసిపిల్లలకు దిష్టి తగలకుండా నల్ల గాజులు వేస్తారు. స్త్రీలు గాజులు ధరించడం వల్ల వారికి తెలియకుండానే నడకలో లయ, లాలిత్యం ఏర్పడుతుందట. అందుకే చిన్నతనం నుంచే గాజుల వాడకాన్ని అలవాటు చేస్తుంటారు.

అయితే స్త్రీలకు గాజులు అలవాటు చేయడం వెనుక పరమార్థం జీవితం చాలా విలువైనదని.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే పగిలిపోతుందనే జీవన సత్యాన్ని ఆడపిల్లకు చిన్నతనం నుంచే అలవాటు చేస్తారట. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేశారు. మగవాడు చాలా దుబారా ఖర్చు చేస్తుంటాడట. కాబట్టి ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే ఆ ఇంట్లో ఎలాంటి లోటూ ఉండదట. ఇక ఆడవాళ్లు ధరించే గాజుల రంగులు కూడా పలు రకాల అర్థాన్ని తెలియజేస్తాయి. ఎరుపు శక్తిని, పసుపు శుభాన్ని, ఆకుపచ్చ అదృష్టాన్ని, నీలం విజ్ఞానాన్ని, ఊదారంగు స్వేచ్ఛను, తెలుపు ప్రశాంతతను, నారింజ విజయాన్ని.. వెండి బలాన్ని, బంగారు రంగు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.

Share this post with your friends