హనుమంతునికి అరటిపండు నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు?

రామావతార పరిసమాప్తి తరువాత హనుమంతుడు తపస్సు చేసుకోవడానికి బదరికావన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి గంధమాదన పర్వతంపై కఠోరమైన తపశ్చర్యలో మునిగిపోయాడు. ఆకలిని సైతం జయించి హనుమంతుడు చేసే తపస్సుకు మెచ్చిన వైకుంఠరాముడు బదరికావనం నుంచి మంచి అరటిపళ్లను తెచ్చి హనుమంతుని ముందు పెట్టేవాడు.

జితేంద్రియుడు కనుక హనుమంతుడు వాటిని ముట్టక తపస్సును కొనసాగించాడు. ఆయన నిశ్చలభక్తికి మెచ్చిన రాముడు భవిష్యత్తులో నవమ బ్రహ్మవవుతావని ఆశీర్వదించాడు. హనుమంతునికి అరటిపళ్లను నైవేద్యంగా సమర్పించేవారికి శాశ్వతమైన మోక్షం ఇస్తానని రాముడు చెప్పాడు. అరటిపళ్ల తరువాత హనుమదర్చనకు దానిమ్మపళ్లు శ్రేష్ఠమైనవి.

Share this post with your friends